తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే సోమవారం వరకు ప్రకటించ వద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు సర్వీసు కమిషన్ కు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని టీ ఎస్ పి ఎస్ సికి సూచించింది. తమ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు కమిషన్ గడువు కోరగా అయితే అప్పటి వరకు ఫలితాలు విడుదల చేయొద్దని ఆదేశించింది.