కృత్రిమ గర్భానికి ఎ.ఐ…!

praneeti

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎ.ఐ.) ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమవుతుందని సినీ నటి ప్రణీత అన్నారు. సికింద్రాబాద్ లోని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ మాతృత్వం ఒక వరమని, మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తి పరమైన ఒత్తిడి పెరిగడం వల్ల సంతాన లేమి సమస్య తలెత్తుతోదని అన్నారు. ఆధునిక పద్దతుల ద్వారా సులభతరంగా సంతాన సాఫల్యం పొందవచ్చని చెప్పారు. ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి మాట్లాడుతూ అనేక ఏళ్లుగా సంతానం కోసం నిరీక్షిస్తున్న మహిళలను కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఆదుకుంటున్నాయని చెప్పారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని, వరల్డ్ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం ను సికింద్రాబాద్ లోని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రపంచ ఐ వీ ఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫర్టీ 9 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ పద్దతులపై మహిళలకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు జ్యోతి వెల్లడించారు.

ferti9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *