కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన మంత్రి మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సరైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు తేల్చింది. పరువు నష్టం కేసు పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దీంతో రాహుల్ గాంధీకి ఊరట లభించినట్టయింది. దిగువ కోర్టులు అభియోగ పత్రాల సంఖ్య చూశాయే గానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వి పరువు నష్టం దావా వేసిన గుజరాత్ ఎంఎల్ఏ పుర్నేష్ మోడీ అసలు ఇంటిపేరు మోడీ కాదని , అయన “మోడీ” అనే పేరుని మధ్యలో జత చేసుకున్నారని కోర్టు దృష్టికి తెసుకు వెళ్లారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మోడీ అనే ఇంటిపేరు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్ ఎంఎల్ఏ పుర్నేష్ మోడీ పరువు నష్టం దావా వేయగా సూరత్ కోర్టు రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు రాహుల్ కి కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చింది.