ఘనంగా చేస్తాం…

dimond

75 ఏళ్ల దేశ స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సి.ఎస్. శాంతి కుమారి ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వెడుకల్లో ప్రజా ప్రతినిదులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు చెందిన ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ వేడుకల తేదీలను ముఖ్యమంత్రి త్వరలో ఖరారు చేస్తారని అన్నారు. ప్రధానంగా, భారత వజ్రోత్సవ ప్లాంటేషన్ పేరుతో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దారించారని, కోటి పదిహేను లక్షల జాతీయ జండాలను పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నామని వివరించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలకంకరించనున్నామని తెలిపారు.రాష్ట్రంలోని విద్యాసంస్థ లలో వ్యాసరచన, వకృత్వ, పెయింటింగ్ తదితర కాంపిటీషన్లను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 5కె, 2కె రన్లను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో పాటు పీసీసీఎఫ్ డోబ్రియల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హ్యాండ్లూమ్స్ శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్, సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, ఆయుష్ శాఖ కమీషనర్ హరి చందన, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *