సెల్ ఫోన్ కోసం దిగితే…

adb c

మొబైల్ ఫోన్ ఒక వైద్య విద్యార్ది ప్రాణం తీసింది. అదీ సరిగ్గా స్నేహితుల దినోత్సవం రోజే ఈ విషాద ఘటన చోసుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఏ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చదువుతున్న ముగ్గురు పిజి విద్యార్ధులు ఆదిలాబాద్ రూరల్ మండలం శివఘాట్ వద్ద ఉన్న వాగుకు విహారం కోసం వెళ్ళారు. వాగులో ముగ్గురు కలిసి స్నానాలు చేశారు. అయితే, వీళ్ళకు చెందిన ఒక సెల్ ఫోన్ జారిపోయి వాగులో పడింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఒక విద్యార్ధి వాగులో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు మిగతా ఇద్దరు కూడా వాగులోకి దిగారు. ముగ్గురిలో ఇద్దరు తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, ప్రవీణ్ అనే విద్యార్ధి వాగులో గల్లంతు అయ్యాడు. స్థానికుల సహాయంతో గలిపు చేపట్టగా ప్రవీణ్ మృతదేహం లభించిది. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *