అడ్డూ అదుపు లేకుండా అత్యంత అమానుషంగా, పాశవికంగా హింసలు చెలరేకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. మణిపూర్‍లో అల్లర్ల కేసు దర్యాప్తును పర్యవేక్షించడానికి, వివరాలను తిరిగి సుప్రీంకోర్టుకు నివేదించడానికి మాజీ ముంబై కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రయ్ పసల్గికర్ ను నియమించింది. అదేవిధంగా ముగ్గురు విశ్రాంత హై కోర్టు జడ్జిలతో కమిటిని ఏర్పాటు చేయాలనీ, ఈ కమిటీ మణిపూర్ అల్లర్లు, హింసపై విచారణ జరుపుతుందని పేర్కొంది. హింసకు సంబంధించిన కేసులు దర్యాప్తు చేయడానికిమని మణిపూర్ కి సంబంధం లేని సి.బి.ఐ. అధికారులను నియమించాలని, అంతేకాక సిబిఐ పనితీరును పర్యవేక్షించడానికి సీనియర్ విశ్రాంత ఐపిఎస్ అధికారిని నియమించాలి. మణిపూర్ కి సంబంధం లేని డిఐజి రంక్ అధికారి సిట్ పనితీరును పర్యవేక్షిచాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వివరించిది.