HYDERABAD

హైదరాబాద్ జిల్లా చరిత్ర

Hyderabad Charminar

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. సమ్మిళిత వాతావరణ పరిస్థితులతో అందరినీ ఆకర్షించే ఏకైక మహానగరం ఈ భాగ్యనగరి.  రజాకార్ల అణచివేత తర్వాత 1948  సంవత్సరంలో హైదరాబాద్ జిల్లా ఏర్పడినప్పటికీ కాల క్రమంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దీన్ని 1978 లో హైదరాబాదు రూరల్, హైదరాబాదు అర్బన్ జిల్లాలుగా విభజించారు.  అయితే,  హైదరాబాద్ రూరల్ పరిధిలోని ప్రాంతాలను కలిపి  రంగారెడ్డి  జిల్లాగా, అర్బన్ ప్రాంతాలను కలిపి హైదరాబాద్ జిల్లాగా మార్చారు. హైదరాబాదు జిల్లా సుమారు రెండు వందల  చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండడం విశేషం. నగరంలో ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు. రాష్ట్ర పాలన పూర్తిగా ఇక్కడినుంచే జరుగుతుంది. రెండు దశాబ్దాలుగా సాంకేతిక, వైద్య రంగాలు విస్తారంగా అభివృద్ధి చెందుతున్నాయి.  హైదరాబాద్,  దాని పరిసర ప్రాంతాల అభివుద్ధి పనులను జిహెచ్ఎంసి (హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ) పర్యవేక్షిస్తుంది. అదే విధంగా వివిధ గ్రామాలను కలిపి 16 మండలాలుగా విభజించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నెలకొల్పడంతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి లోనూ మంచి గుర్తింపు పొందింది. కోటికి పైగా జనాభా, చార్మినార్,  గోల్కొండ కోట వంటి చారిత్రిక కట్టడాలు, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలు హైదరాబాద్ సొంతం.

భిన్న సంస్కృతులు

హైదరాబాద్ అంటే భిన్నమతాలు, విభిన్న కులాలకు నిలయం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు పలు రాష్ట్రాల వారూ అధిక సంఖ్యలో  ఇక్కడ  స్థిరపడటం వల్ల అన్ని రకాల భాషలు, యాసలు ఇక్కడ సహజం. ఇక్కడ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. ఇక్కడ మాట్లాడే  హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటి కంటే భిన్నంగా ఉండడం గమనార్హం. సికింద్రాబాద్ ప్రాంతం లో ఎక్కువగా ఉత్తర భారతానికి  చెందినా వారు, పాత బస్తీలో అధికంగా ముస్లింలు ఉంటారు. రవాణా సౌకర్యం

amaravirulu

దేశంలో దాదాపు ఏ రాష్ట్రంలో లేనంతగా హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థ అభివృద్ధిచెందింది. ఏడాదికి లక్షల సంఖ్యలో దేశ, విదేశాల నుంచి ప్రయాణం సాగించడం వల్ల అందుకు తగినట్టుగానే రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, మెట్రో రైలు, లోకల్ ట్రైన్లు, వందల సంఖ్యలో అర్బన్, సబ్ అర్బన్ బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయం

తెలంగాణ ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడక ముందు 13 శాసన సభ నియోజక వర్గాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ  వాటి సంఖ్య 15 కి పెరిగింది. ఈ  నియోజకవర్గాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గాలలో ఏడు చొప్పున, మిగతా ఒక నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.  మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, గోషామహల్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాంపల్లి, కార్వాన్,  జూబ్లీ హిల్స్, చాంద్రాయాన గుట్ట, యాకుత్ పురా, సనత్ నగర్ లను శాసన సభ నియోజక వర్గాలుగా  ఉన్నాయి. కాంగ్రెస్, ఎం ఐ ఎం, బిజెపి, బారాసా పార్టీలు ఎన్నికల బరిలో పోటీ పడుతుంటాయి.