కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రిజనరీ, సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలు పాలు చేశాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత వ్యాఖ్యానించారు.చంద్రబాబుని జైలుకు పంపారన్నజైలుకి పంపాలన్న ఏకైక లక్ష్యం తొ చేయని తప్పుకి ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సహా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డే నాలుగేళ్లుగా కోర్టులకు హాజుకాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. బాబాయ్ హత్యకేసు, కోడికత్తి కేసులో తన పాత్ర, ప్రమేయం ఉన్నా బుకాయిస్తూ నిస్సిగ్గుగా ఢిల్లీ పెద్దల కాళ్లుపట్టుకొని అధికారంలో కొనసాగుతున్నాడని దుయ్యబట్టారు. వార్డు సభ్యుడిగా గెలవలేని సజ్జల రామకృష్ణ రెడ్డి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుని మానసికంగా క్షోభ పెట్టాలన్న జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన తప్ప, వాస్తవంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఆవగింజంత కూడా అవినీతి లేదన్ని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పోలీస్ వ్యవస్థను వైసీపీకి ఊడిగం చేసే విభాగంగా మార్చి, సీఐడీ, సీబీసీఐడీ విభాగాలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నారని సునీతా వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల పాలనలో ఇసుక, మద్యం మాఫియాల మాటున వేలకోట్లు దిగమింగి, ప్రకృతి వనరులు, ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కాజేశాడని ఆరోపించారు. చంద్రబాబుని జైలుపాలు చేశారన్న ఆనందంతో సంబరాలు చేసుకోవడం రోజా నీతిమాలినతనానికి నిదర్శనమన్నారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన తెలుగుదేశాన్ని, చంద్రబాబుని తూలనాడుతున్న రోజాను వచ్చే ఎన్నికల్లో నగరి నియోజక వర్గ ప్రజలు శాశ్వతంగా వదిలించుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పారు.
జగన్”సైకో” – సునీతా …
