ధృఢ సంకల్పంతో నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 చంద్రుని పై అడుగు పెట్టడానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు సాంకేతిక పరంగా అన్ని దశలూ విజయవంతంగా దాటుకుంటూ చందమామపై చక్కర్లు కొడుతున్న ల్యాండర్ ఇస్రో శాస్త్రవేత్తలకు చిత్రాల రూపంలో సందేహాలు పంపుతోంది. ల్యాండర్హ హాజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలు తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రునిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు ఈ కెమెరా ఉపయోగపడుతుంది. అది దిగడానికి సౌకర్యవంతంగా ఉండే స్థలాన్ని ఈ ఫోటోల సాయంతో ఇస్రో నిర్ణయిస్తుంది.