హంస హొయలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. నీటి కొలనులో వయ్యారం వలకబోసే హంస వంపులు మహా రమణీయం. దాని సొంపైన నడక రసరమ్యం. ఆ నడక, ఆ హొయల కలబోత నటి హంసా నందిని అనడంలో సందేహం లేదు.
ఆమె బికినీ వేసినా, బిరుసైన దుస్తులు వేసిన వాటి కంటే “హంసా” చీరకట్టే కుర్రకారుకి ఓ కిక్కు. సినిమాల్లో ఏ వ్యాంప్ కారెక్టర్స్ అయినా మోడ్రన్ డ్రెస్సులతో కనువిందు చేస్తాయి. కానీ, అదే క్యారెక్టర్ లో కనిపించే హంసా నందిని ఆకర్షణ మాత్రం వేరుగా ఉంటుంది. సాధారణంగా ఆమె పొడవాటి మేనికి ఏ ఆమె మోడ్రన్ డ్రెస్సు వేసినా అందం మరింతగా ఉట్టి పడుతుంది.
కానీ,అదే ఆమె. చీర కడితే ఆ కనువిందు ఆస్వాదించే వారికే సొంతం. “వారీ దేవుడో దేవుడో” అంటూ చీర వంపులో సాగే హంసా నాట్యం చూస్తుంటే ప్రేక్షకుల్లో ఇక మైమరపే. కొంతకాలం కిందటే క్యాన్సర్ మహమ్మరి నుంచి బయట పడ్డ హంసా నందిని మళ్ళీ సినిమాల పై దృష్టి పెట్టినట్టు సమాచారం.ఆమె త్వరగా వెండి తెరపై కనిపించి గతాన్ని గుర్తు చేయాలని ఆశిద్దాం…