ఎందుకీ నిర్లక్ష్యం…

image

అనలోచిత నిర్ణయాల వల్ల చేతికందుతుందనుకున్న ఫలాలు దక్కని పరిస్థితి నెలకొంది. ఒకే సంఘంలో భిన్నాభిప్రాయాలు సభ్యుల భవిష్యత్తును, ఆశలను వేదనకు గురి చేస్తున్నాయి. డబ్బు చెల్లించి  దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుకు ఆ భూములు ఇవ్వండని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడం ఆ సొసైటిలోని సామాన్య సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకే  ఇవ్వలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా దాన్ని  ప్రభుత్వం పెడచెవిన పట్టడంతో సమస్య మొదలైంది. అన్ని సంఘాల్లో ఉన్నట్టుగానే ఈ సంఘంలోనూ ఉన్న ఒక  వర్గం బయటకు వచ్చింది. . పేట్ బషీరాబాద్  గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించాలని పోరాటం మొదలు పెట్టింది. ఈ కార్యక్రమమలో కొన్ని సందర్భాలలో హౌసింగ్ సోసైటి అధికారిక సభ్యులు సైతం పాల్గొన్నారు. ఎం.ఎల్.ఎ.లు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.అధికారుల స్థలాల కేసుతో ప్రమేయం లేకుండా జర్నలిస్టుల కేసుని విడదీసి జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది ఆగస్టులో ఇళ్ళ స్థలాల సమస్యపై తుది తీర్పు ఇచ్చింది.  పేట్ బషీరాబాద్ లోని స్థలం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకే చెందుతుందని స్పష్టంగా సూచించారు. ప్రభుత్వం గాని, అధికారులు గాని ఆ తీర్పులు పట్టించుకోకుండా సాగదీయడం సమస్యకు తెరలేపింది. గత ఐదారు నెల్ల నుంచి సభ్యులు నిరసనలకు దిగినా అటు ప్రభుత్వం, మరోవైపు మీడియా అకాడమి పట్టించుకోక పోవడం సమస్యను మరింత జటిలం చేసింది ఏడాది గడుస్తున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందిన కొందరు సభ్యులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై కోర్టు ధిక్కా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం దాన్ని ప్రధాన కేసుతో పాటు పరిశీలిస్తామని చెప్పడంతో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో కొత్త ఆందోళన రేకెత్తింది. తుది తీర్పు వచ్చిన కేసును ప్రాధాన పిటిషన్ తో ఎలా చేరుస్తారంటు సందేహాలు తలెత్తాయి. అయినా జస్టిస్ రమణ ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పే అంతిమం అని మెజారిటి సభ్యులు ఆశతో ఉన్నారు. కాని, కమిటి సభ్యుల్లో తలెత్తిన పొడచోప్పలు 1050 సభ్యులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. సుప్రీంకోర్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయంతో సహా నిన్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై దృష్టికి ఈ సమస్యను వెళ్లడాన్ని అధికారిక సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక అందులోని కొందరు ప్రతిపక్షాల మాట వింటున్నారని, ఫలితంగా సమస్యలు తలెత్తుతున్నాయని అధికారిక కమిటి వ్యాఖ్యానించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి సభ్యులు స్పందిస్తూ కోర్టు ఆదేశాలను కాపాడుకోవడానికే తాము పిటిషన్ దాఖలు చేసినట్టు చెబుతున్నారు. అసలు తీర్పు వచ్చిన కేసును ఈ నెల 13 తేదిన విచారణకు వచ్చే ప్రధాన కేసుతో ఎలా జత చేస్తారని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని హైదరాబాద్ లోని జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతునారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *