అవినీతి కోసమే “స్కిల్”…

ap cid c

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అక్రమాలు చేయడానికే ప్రారంభించారని  ఆ రాష్ట్ర సి.ఐ.డి.చీఫ్ సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే నాటి కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్ను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అంతేకాక, ఈ సుబ్బారావుకు ముఖ్యమంత్రి సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా మరో నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని వివరాలు వెల్లడించారు. చంద్రబాబును విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టులో ఈ సాయంత్రం లోపు హాజరుపరుస్తామని సంజయ్ తెలిపారు.

babu arrest

చంద్రబాబును అరెస్టు చేయడానికి వెళ్ళిన అధికారులు అర్థరాత్రి నంద్యాలకు చేరుకున్నా, ఉదయం 6 గంటల సమయంలో ఆయనతో మాట్లాడామన్నారు. ఓర్వకల్లు నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని చెప్పగా చంద్రబాబు నాయుడు  తిరస్కరించారని చెప్పారు. ఆయన వయసు, ఆరోగ్యం, హోదా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *