ఘనంగా పూజలు…

IMG 20230918 WA0058

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అయన సతీమణి శోభమ్మ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు.

IMG 20230918 WA0060

గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ అయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ప్రగతి భవన్ సిబ్బంది పాల్గొని గణపతికి పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *