కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో మళ్లీ ఉగ్ర మంటలు చెలరేగాయి. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్ దక్షిణ ఇజ్రాయిల్‌లోకి చొరబడి ఇష్టానుసారంగా పౌరులపైకి రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వైపునకు పెద్ద ఎత్తున మిస్సైల్స్ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్ టెల్ అవీవ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్ధం వినిపించడంతో ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తం అయింది.యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
అనేకమంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్‌పై కొత్త సైనిక చర్య ప్రారంభమైనట్లు హమాస్ గ్రూప్ నాయకుడు ప్రకటించారు. ఇజ్రాయిల్‌ను వ్యతిరేకిస్తున్న మహాస్ గ్రూప్ చీఫ్ మహమ్మద్ డీఫ్ పేరు మీద ఈ ప్రకటన వెలువడింది. ‘ఆపరేషన్ అల్-అక్సా’ ఇజ్రాయెల్ పై 5ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు డీఫ్ పేర్కొన్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇజ్రాయెల్ తమ ప్రాంతంలోని గాజాపై చేసిన దాడుల్లో 161 మంది పౌరులు చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు హమాస్ ఉగ్రవాదుల దాడుల్లో 40 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా, 750 మంది గాయపడ్డారు. ఇజ్రాయేల్ హమాస్ మూకలు చేసిన దాడులను అగ్రరాజ్యం అమెరికాతో పాటు భారత్, బ్రిటన్, ఇటలీ తదితర దేశాలు ఖండించాయి. ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం, వారి ఆస్తులకు నష్టం వాటిల్లెలా చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి.