అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో నడి రోడ్డు పై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కలకలం రేపింది. అమలాపురం ఎస్. కె. బి.అర్.కాలేజీ లో డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. బిఎ, బి కామ్ గ్రూపుల మధ్య గొడవ తలెత్తి గ్రూపులుగా విడిపోయి రోడ్డు పై కొట్టుకున్నారు. 5వ తేదీన జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఒక పాట విషయంలో వివాదం తలెత్తింది.మంగళవారం సాయంత్రం కొంతమంది కావాలని మళ్ళీ గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపుల విద్యార్థులను ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు.
స్ట్రీట్ ఫైట్….
