మేనిఫెస్టోలో”కలం”వీరులు..!

journ sridher

దశాబ్దాలుగా అపరీష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టో లో వాటిని చేర్చాలని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోరింది. ఈ మేరకు తెలంగాణా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఛైర్మెన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుని వేదిక ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి వాటి పరిష్కారానికి, సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అందుకు సానుకూలంగా స్పందించిన శ్రీధర్ బాబు గారు డిమాండ్లను పరిశీలించి మేనిఫెస్టో చేర్చేందుకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కోడూరు శ్రీనివాస్ రావు, జె. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాధిక్, సహాయ కార్యదర్శి మధు, కార్యదర్శి, కోశాధికారి సురేష్,కంచ రాజు శ్రీధర్ బాబుని కలిశారు.

ఇదిలాఉంటే,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇంటి స్థలమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల బృందం కుడా ఆయన్ని కలిసింది. సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి, ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, నాగరాజు తదితరులు గాంధీభవన్ లో శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనూ డీజేహెచ్ఎస్ బృందం ఈ విషయంపై చర్చించిన విషయం, గతంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సైతం ఈ విషయంపై వినతిపత్రం సమర్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *