హైదరాబాద్ జిల్లా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ మొండా మార్కెట్ నుండి సనత్ నగర్ బస్ స్టాప్ వరకు కార్లు, మోటారు సైకిళ్ళతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపు వెయ్యి కి పైగా వాహనాలు, బైకులతో సుమారు రెండు వేలమంది ఈ ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. ఈ మధ్య కాలంలో నగరంలో ఇంతటి భారీ ర్యాలీ జరపడం మొడటి సారి.