"మేడి"పాపం కేసీఅర్ దే... - EAGLE NEWS

“మేడి”పాపం కేసీఅర్ దే…

revant 768x512 1

కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్ చేశారు. మేడిగడ్డకు వెళ్లేందుకి ఈసీకి లేఖ రాయనున్నట్టు, కేటీఆర్, హరీష్ రావు తమతో కలిసి బ్యారేజీల వద్దకు రావాలన్నారు. అంతేకాక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి మేడిగడ్డలో పర్యటించాలని రేవంత్ కోరారు. ప్రైవేట్ కంపెనీలు నిర్మించాయని, తమకు సంబంధం లేదనీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. సంఘ విద్రోహక శక్తులు ఉన్నాయా లేక మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలనీ, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *