ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సప్ మొదటిస్థానంలో ఉంటుంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఆసక్తికర ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరొక ఫీచర్‌ను పరిచయం చేసింది. వాట్సప్ అకౌంట్లోకి లాగిన్ కావాలంటే ఫోన్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారానే వాట్సప్ అకౌంట్లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉండేది. ఐతే ఇకపై ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే వాట్సప్‌లోకి లాగినయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ – మెయిల్ వెరిఫికేషన్ ద్వారా వాట్సప్ అకౌంట్లోకి లాగినయ్యే ఫీచర్‌ను పరిచయం చేయనుంది.ఇప్పటి వరకు కొత్త ఫోన్లో వాట్సాప్ లాగిన్ చేయాలంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండేది. ఇందుకోసం 6 అంకెల ఓటీపీ మెసేజ్ ఫోన్‌కు వస్తుంది. ఒకవేళ ఫోన్ పనిచేయకపోయినా, నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా ఓటీపీ రాదు. దీనికి అల్టర్నేటివ్గా వాట్సప్ లాగిన్ కోసం ఈ – మెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.