స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు పూర్తి స్థాయి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. “స్కిల్” కేసులో ఇప్పటికే రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై వాదనలు పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది. దీపావళి సెలవుల తరువాత తీర్పు ఇస్తామని వెల్లడించింది. ఫైబర్ నెట్ కేసులో ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తుపై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
Very interesting points you have remarked, thank you for putting up.Money
from blog
thank you very much dear..
pl click on advertisement to encourage “Eaglenews”…tnq