తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టిక్కట్లు దక్కక తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే చర్యలు మొదలయ్యాయి. కొన్ని పార్టీలు ముడో కంటికి తెలియకుండా ఈ తతంగం పూ[పూర్తీ చేస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం బాహాటంగానే బుజ్జగిస్తున్నాయి. బిజెపి, బారాసలు జిల్లా స్తాయిల్లోనే రెబల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీనియర్ నేతలతో మాటా మంతి మొదలుపెట్టింది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణు నాథ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆ రెబెల్స్ తో చర్చలు జరుపుతున్నారు. రకరకాల హామీలు ఇస్తూ రెబెల్స్ ను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కీలక నియోజక వర్గాలలో రెబెల్స్ ను ఉపసంహరించే ప్రయత్నం చేస్తున్నారు.