తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వరంగల్ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు అదానీకి, సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే లాభం చేకూరుస్తారని, తెలంగాణ రాష్ట్రం సాకారమైన తరువాత దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు లాభపడతాయని అనుకున్నామని, కానీ అలా జరగలేదని పేర్కొన్న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కులగణన చేపడతామని, ఏఏ కులాలు వెనకబాటుకు గురయ్యాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి మొదలుకొని కశ్మీర్ వరకు పాదయాత్ర చేశానని, ఆ సమయంలో ఆరెస్సెస్, భాజపా ప్రజలను ఏ విధంగా విభజిస్తున్నాయో అర్థమైందని తెలిపారు. ఇది విద్వేషాలు రగిలించే దేశం కాదు ప్రేమను పంచే దేశం అని చెప్పదల్చుకున్నా. భాజపా, భారాస ఒక్కటే. ఒకరు దిల్లీలో పనిచేస్తే మరొకరు తెలంగాణలో పనిచేస్తున్నారని, ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని అన్నారు. తెలంగాణలో భాజపా నాయకులు కొన్నాళ్లు హడావిడి చేసి ఇప్పుడు చప్పుడు చేయకుండా ఉన్నారని, భారాసను గెలిపించడానికి వారు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభలోనూ ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి ఉన్న విషయాన్ని సభలో గమనించినాట్టు, బాజాపా ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చిందన్ఇనారు. ఎంఐఎం. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భాజపాతో కొట్లాడుతుందో అక్కడ ఆ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని చెపారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే ఏకైక లక్ష్యమని, ఆ తరువాత దిల్లీలోని నరేంద్ర మోడీని గద్దె దింపుతామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై తొలి మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకొని సంతకాలు పెట్టిస్తా’’ అని హామీ ఇచ్చారు.