అస్తుల పంపకంలో “సంతకాలు”..!

property

ప్రశ్న: పూర్వీకుల ఆస్తులకు కొందరే వారసులు అవుతారా?

జ. తాతల ఆస్తులకు వారి వల్ల కలిగిన రక్త సంబంధీకుల సంతానం మొత్తం వారసులు అవుతారు. అయితే వారంతా మేజర్లు అయ్యి ఉండాలి, అలాకాని పక్షంలో వీరు పెరిగే వరకూ వారి తల్లి దండ్రులు వారసులుగా చెలా మ ణి అవుతుంటారు, మేజర్ అయినాక వారసత్వ లైన్ లోకి వస్తారు, వీరి అనుమతి లేకుండా తండ్రి తనకు వచ్చిన వారసత్వ ఆస్తిని అమ్మే వీలు ఉండదు. ఎన్.టి. రామారావు హయాంలో కుటుంబంలోని ఆడ పిల్లల కు కూడా వారసత్వ ఆస్తిలో భాగం పెడుతూ బిల్లు తెచ్చారు, ఇటువంటి వారసత్వ విషయాల్లో కేవలం రాష్ట్ర చట్టాలే చెల్లు బాటు కావు, ఇందులో మత సంప్రదాయాలు, ఆచారాలు వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి, ఇది చాలా విస్తృతమైన అంశాలు ముడి పడి ఉన్న బిల్లు కాబట్టి కేంద్రము దాన్ని తిప్పి పంపింది, ఇక అప్పటి నుంచి దాన్ని అలా పెండింగ్ లోనే ఉంచారు, అంతేకాక, పెళ్లి సమయంలో కుమార్తెకు ముట్ట జెప్పే కానుకల లో ఈ అంశాన్ని కూడా పరిగణన లోకి తీసుకుని “వన్స్ ఫర్ అల్” అన్నట్టు కొంత ఇచ్చి సెటిల్ అయినట్లుగా చెప్పే సంప్రదాయం పాటిస్తున్నారు, తండ్రి స్వార్జితం అనేది ఎలాగూ ఆయన ఇష్టం. అందులో కూతురుకి వాటా ఇవ్వవచ్చు ఇవ్వక పోవచ్చు. కొడుకులకు అయినా ఆయనని మలి వయసులో ఆదరించి బాగోగులు చూస్తేనే ఆస్తి ఇవ్వడం లోకరీతి, అయితే తాత నుంచి సంక్ర మించి న ఆస్తి రాకుండా తండ్రి అడ్డు పడలేరు, అదే వారసత్వ ఆస్తి ని తండ్రీ, కొడుకులు సమానంగా వాటాలు వేసి పంచు కో వలసిందే. ఇదంతా హిందూ వారసత్వ చట్టాలకు లోబడి ఉండే విధానాలు, ఇతర మతస్థులకు ఇవి వేరుగా ఉంటాయి, వాటికి సంబంధించిన వివాదాల స్వభావం, తీర్పు వేరుగా ఉంటాయి, వారసత్వ ఆస్తులనేవి చాలా సంక్లిష్టత తో కూడిన వ్యవహారం. వారసుల మధ్య ఎటూ తేలక కోర్టుకు ఎక్కి దావాలు ఏళ్ళూ పూళ్లు గడిచిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. జయ లలిత మరణించాక ఆమె ఆస్తులు కి వారసులు ఎవరూ లేరన్న వాదనని మద్రాసు హై కోర్టు కొట్టి వేసింది, ఆమె మేన కోడలు మేనల్లుడిని వారసులుగా గుర్తించి 350 కోట్ల వివాదాలు ఏమీ లేని ఆస్తిని అప్ప జెప్పింది, వారు జయ లలితకు అన్న పిల్లలు అంటే రెండో స్టెప్ రక్త సంబంధం ఉన్న వారని కోర్టు తేల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *