వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారత జట్టు భావోద్వేగానికి లోనూ కాగా వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్, కోహ్లితో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలో గెలుపోటములు సహజంఅని, మీరు పోరాడారంటూ టీమ్ ని అభినందించారు. ‘రాహుల్ ఎలా ఉన్నావ్’ అంటూ ద్రావిడ్ ని పలవరించి, చాలా బాగా ఆడావ్ అంటూ మోడీ షమీని హత్తుకున్న వీడియోను భారత క్రికెట్ బోర్డు తాజాగా వీడియో విడుదల చేసింది.