80 సీట్లు మావే…!

nzb revanth c scaled

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, నియోజక వర్గంలలో జరిగిన విజయభేరి జనసభలలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని, అందుకే మతి తప్పి మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో తెలియదు కాని, కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు . నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్ కు చెబుతున్నా 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తారు 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని రేవంత్ వ్యాఖ్యానించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేం ఓట్లు అడుగుతామని, అదే కాళేశ్వరం మెడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలవా అని ప్రశ్నించారు. కేసీఆర్ మూతి మీదున్న మీసాలున్న మొనగాడివే అయితే ఈ ఛాలెంజ్‌కు అంగీకరించాల న్నారు. కేసీఆర్ గుర్తు పెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెట్టి బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం. బీఆర్ఎస్ అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ ఊహాలోకంలో ఉంచారు. ఆయన మాత్రం 150 రూముల బంగ్లా కట్టుకున్నాడని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని మంచి పనులే, పేదల సంక్షేమానికి కొదువ ఉండదని రేవంత్ రెడ్డి వివరించారు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారని, 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు.

nzb revanth in

అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్ తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరని నారాయణఖేడ్ సభలో రేవంత్ రెడ్డి విమర్శించారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్ మందేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. నల్లవాగు లిఫ్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్ ను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

revnt naraynkd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *