కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించి, పొలిమేరలకు తరమాలని గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు పాతాళానికి తోక్కుతారని తెలిసే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయిండని, కామారెడ్డికే కాదు కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారన్నారు. గజ్వేల్ లో జరిగిన ఎన్నికల సభలో రేవంత్ మాట్లాడుతూ రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకపోయేందుకే ప్రాధాన్యతనిచ్చాడని విమర్శించారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకున్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా? అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేస్తే మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిన విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు. “నేను ఇక్కడికి వస్తున్నానని కేసీఆర్ కొడంగల్ పోయాడని, నా నోరు తెరిస్తే కంపు అని కొడంగల్ లో కేసీఆర్ మాట్లాడారని, “డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్” సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు. లక్షకోట్లు మింగి, పదివేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు కేసీఆర్ అని విమర్శించారు.