ఇలా చేయండి…

eleccomis last

ఈ నెల ౩౦వ తేదీన జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జాయింట్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులు ఉంటారని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు పి.ఓ డైరీ, ఫారం-17ఏ, 17 సి పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. పి.ఓ ల వద్ద సంబంధిత పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితా, ఏ.ఎస్.డి లిస్ట్ కలిగి ఉండాలని తెలిపారు. ఉదయం 5:30 గంటలకే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ ను నిర్వహించాలని, 50 ఓట్లను వేసి వాటిని సి.ఆర్.సి ద్వారా క్లియర్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వి.వి.ప్యాట్ స్లిప్ లను భద్రపర్చాలని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్లు ఎపిక్ కార్డుతో పాటు భారత ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను పరిశీలించాలని సూచించారు. ఆధార్ కార్డు, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటో తో కూడిన పాస్ బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ  ద్వారా జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డు ,స్మార్ట్ కార్డు, పాస్ పోర్టు, ఫోటోతో కూడిన పింఛ‌న్‌ మంజూరు  డాక్యుమెంట్ , ఫోటో తో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ  ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలు జారీచేసిన అధికార గుర్తింపు ప‌త్రం, దివ్యాంగుల గుర్తింపు కార్డు ఏదైనా ఒక  గుర్తింపు కార్డులను వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించు కావాలని తెలిపారు.  ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 29వ తేదీన సంబంధిత డి.ఆర్.సి సెంటర్లకు వెళ్లి ఈ.వి.ఎం లను సేకరించుకొని నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *