ఈ నెల 30న జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షో వరకు దాదాపు 87 సభలో పాల్లొన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల గాంధీ, ప్రియాంక, మల్లికార్జున కార్గే వంటి నేతలతో రేవంత్ అనేక సభల్లో పాల్గొన్నారు.