“హ్యాట్రిక్” వర్సెస్ “వన్ ఛాన్స్”…! - EAGLE NEWS

“హ్యాట్రిక్” వర్సెస్ “వన్ ఛాన్స్”…!

hatric cfy

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శాసన సభకు ముడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత ఉత్కంటభరితంగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడానికి పోలింగ్ కేంద్రాలు సిద్దమైయాయి. ఈ సారి కూడా అధికారం తమదే అవుతుందని అధికార భారత రాష్ట్ర సమితి ధీమాగా ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సైతం ప్రజలు తమకే పట్టం కడతారని కొండంత ఆశతో ఉంది. భారతీయ జనతా పార్టీ  కూడా రాష్ట్రంలో గులాబీ రంగు కాస్తా కషాయంగా మరుతుదేమో అంటూ వేచి చూస్తోంది. కానీ, ప్రజల నాడిని మాత్రం ఏ రాజకియాజ్ పక్షం అంచనావేయలేక పోతోంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పెయిడ్ సర్వేలు ఐనా, ఫేక్ సర్వేలు అయినా, నిజమైన సర్వేలైనైనా సరె గమనిస్తే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించే అవకాశం ఉన్నట్టు ప్రచారం అయింది. తెలంగాణలో ప్రజలు బిఆర్ఎస్ కి “హ్యాట్రిక్” పట్టం కడతారా లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తామే అని చెబుతున్న  కాంగ్రెస్ పార్టీని తొలిసారి అందలం ఎక్కిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ చోటా ఈ అంశమే చర్చనీయాంశంగా కనిపిస్తోంది. సంపన్నవర్గాలు మొదలు సామాన్యుల వరకు ఓట్లు, పార్టీల గెలుపు, ఓటముల ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే, “ఒక్క ఛాన్స్- హ్యాట్రిక్”ల వ్యవహారాన్ని కూడా రాజకీయ పరిశీలకులు బేరీజు వేస్తున్నారు. దీని కోసం గత ఎన్నికల ఫలితాలు, వాటి గణాంకాలను పరిశీలిస్తున్నారు. ఈ లెక్కల సంగతిని విశ్లేషిస్తే ఇలా ఉంది.

hatric c

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1957 వ సంవత్సరం నుంచి తెలంగాణ ఏర్పడక ముందు వరకు జరిగిన ఎన్నికల తీరు, ప్రజలు ఆయా పార్టీలకు అధికారం కట్టబెట్టిన వైనాన్ని పరిశీలిస్తే “హ్యాట్రిక్” అదృష్టం ఏ పార్టీకి  దక్కిన దాఖలాలు లేఫు. 1957 వ సంవత్సరంలో జరిగిన శాసన సభ మొదటి సాధారణ ఎన్నికల నుంచి 1978 వ సంవత్సరంలో జరిగిన ఐదో శాసన సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకచాత్రాదిపత్యం చేసింది. అప్పట్లో బలమైన ప్రతిపక్షం గానీ, ప్రాంతీయ పార్టీల ప్రభావం కానీ లేకపోవడంతో పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగిన్సిందని సీనియర్ నేతలు చెబుతున్నారు. 1983 వ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో కొత్త రకం రాజకీయ చెదరంగానికి తెర లేసిందని పేర్కొంటున్నారు. 1983 వ సంవత్సరం నుంచి 1999 వరకు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతల వ్యూహాలు, అంచనాలకు భిన్నంగా అధికారాన్ని కట్టబెట్టడం విశేషం. 1983, 1985 ఎన్నికల్లో 200 పై చిలుకు స్థానాలతో  తెలుగుదేశం పార్టీని అధికరంలోకి తెచ్చిన ఓటర్లు, 1989 ఎన్నికల్లో 181 సీట్లతో కాంగ్రెస్ ని అధికారంలోకి  ఇచ్చారు. అయితే, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నారు. 2004, 2009 శాసన సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తమ పందా మార్చుకున్నారు. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యెత్తి జై కొట్టారు. రాష్ట్ర విభజన తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న అప్పటి టిఅర్ఎస్  2014 లో తెలంగాణ రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014 ఎన్నికల్లోనూ టిఅర్ఎస్ వైపే జనం మొగ్గు చూపారు. ఇలా గత ఫలితాలను బట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెదతారా అనేది ప్రధాన చర్చగా మారింది. దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అక్కడ జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలపై విశ్లేషకులు దృష్టి పెట్టారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడ నెలకొన్న ప్రత్యెక పరిస్థితుల వల్ల జ్యోతిబసు,  బిజు పట్నాయక్, ఎం.జీ.ఆర్.లు మూడు సార్లు విజయం సాధించారు.  అంతేకాని, మరే రాష్ట్రంలోనూ ఒకే పార్టీ  హ్యట్రిక్ విజయాన్ని అందుకోలేదు.  ఇలాంటి గణాంకాలనే తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి లు విశ్లేషిస్తున్నాయి. ఈ మూడు బలమైన పార్టీలే కాబట్టి ఎవరి అంచన్నాల్లో వారు ఉన్నారు. కానీ, గత పరిస్థితులు పునరావృతం అయితే మాత్రం అధికార బిఆర్ఎస్ కు గడ్డు సమస్యే అని పరిశీలకుల అభిప్రాయ పడుతున్నారు. అభివృద్దిని చూపుతున్న అధికార పార్టీ, ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నవిపక్షాల మధ్య జరుగుతున్న తెలంగాణ ఎన్నికల పోరులో ఓటర్లు ఇ.వి.ఎం. యంత్రాలపై ఈ గుర్తు వైపు ఎక్కువ మొగ్గుచుపుతారనేది నిజంగా భరించలేని ఉత్కంట రెపుతోంది. వచ్చే నెల 3 వ తేదిన వెలువడే ఫలితాల్లో బిఆర్ఎస్ కు “హ్యట్రిక్” దక్కినా, కాంగ్రెస్ కి  “ఒక్క ఛాన్స్” వచ్చినా సంచలనమే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *