కొత్త స్పీకర్-కొత్త మంత్రులు…

speakr

తెలంగాణ శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ,నేడు పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ ని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్ లో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

sridr swrn

రాష్ట్ర సమాచార,గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో భాద్యతలు స్వీకరించారు. భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ మొదటి ఫెయిల్ పై మంత్రి సంతకం చేశారు. రూ. 9 .50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖ కు కేటాయించారు.

pongulti swrn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *