"జెమిని 1.0"…! - EAGLE NEWS

“జెమిని 1.0″…!

Gemini

మారుతున్న కాలంతో పాటు పోటీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మనుషుల మధ్యనే కాదు ఆ మనిషి తయారు చేసే బొమ్మల మధ్య కూడా విచిత్రమైన పోటీ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా “ఛాట్ జిపిటి-గూగుల్ జెమిని”లను చూపవచ్చు. ఇప్పటికే కృత్రిమ మేధ (ఏ.ఐ.) రంగంలో సంచలనాలకు కేంద్రమైన ఛాట్‌జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజన్‌ గూగుల్‌ కొత్తగా ‘గూగుల్‌ జెమిని’ పేరుతో అడ్వాన్స్‌డ్‌ ఏఐ మోడల్‌ ఛాట్‌బోట్‌ను ఆవిష్కరించింది. ఇది టెక్ట్స్‌, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్‌ తదితర అంశాలపై యూజర్లకు 90 శాతం కచ్చితత్వంతో కూడిన సమాధానాలు అందిస్తుందని గూగుల్‌ తెలిపింది. జెమిని 1.0 వర్షన్‌ పేరిట మూడు వేరియంట్లు జెమిని ఆల్ట్రా , జెమిని ప్రో , జెమిని నానోను అందుబాటులోకి తెచ్చామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందించే గూగుల్‌ జెమిని విద్యార్థుల రోజువారీ హోంవర్క్‌లోనూ సహాయ పడుతుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *