అమ్మో “మమతా”…!

images 32

గత పదేళ్లుగా “ఒంటెద్దు సర్కార్”కి భజన బృందంతో వంత పాడింది. ఎవరో ఒక నేతని కొంగున కట్టుకొని కూర్చున్న చోటే రాజ్యం ఏలింది. నమ్ముకున్న నాయకురాలిగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలనే నైతిక నాయకత్వ బాధ్యతను నీ బాంచెన్ అంటూ “ఒంటెద్దు సర్కార్” కాళ్ళ ముందు తాకట్టు పెట్టింది. ఉద్యోగులకు అసలు పోరాడే వీలు లేకుండా అడ్డం పడింది. తన “పలుకు”బడితో భర్త వెంకటేశ్వర్లుని వివిధ హోదాల్లో నియమించుకునే స్థాయికి ఎత్తులు వేసింది.

images 35

సొంగకర్చే నేత బలంతో పదవీ విరమణ చేయాల్సిన భర్తను కాపాడుకుంది. భర్త కోసం ఎన్జీఓ నేత నుంచి మంత్రిగా ఎదిగిన నాయకుని సహకారంతో పదవీ విరమణ వయస్సును ఏకంగా 58 నుంచి 61ఏళ్ల కు పెంచే విధంగా ఒత్తిడి తెచ్చిదనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ఈ ఆరోపణలు కోడై కూసినా “ఒంటెద్దు” బలంతో లెక్కచేయలేదు. ఎవర్నీ పట్టించుకోలేదు. గతం నాదే, భవిష్యత్తు నాదే అనుకుందో లేక తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే “ఒంటెద్దు” ఒక్కటే రాజ్యం ఏ లుతుందనుకుందో తెలియదు కానీ 8 ఏళ్ళుగా మమత మాయలు, ఆమె భజన బృందం మాటలకు అదుపు లేకుండా పోయింది. అసలు విషయం ఏమిటంటే మొన్న ప్రభుత్వం మారడం, ఆమె నమ్ముకున్న నేత ఓడిపోవడంతో జీహెచ్ఎంసీలో అత్యంత కీలకమైన కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత సెలవులో వెళ్లారు. టీజీవో ప్రెసిడెంట్ గా ఉన్న మమత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన హవా కొనసాగించారు. గతంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలను నిర్వహించారు. అదే ప్రాంతంలో జోనల్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టారు. ఆ తరువాత జీహెచ్ఎంసీలో తనకు తిరుగులేదనే విధంగా కొనసాగారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బల్దియాలోనే ఉన్నారు. గతంలో మమతను కూకట్ పల్లి జోన్ నుంచి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, గంటల వ్యవధిలోనే తిరిగి అదే స్థానానికి బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సీన్ మారిపోయింది. కొత్త ముఖ్యమంత్రినీ కలిసిన మమత ఆకస్మికంగా సెలవు పై వెళ్లడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఉద్యోగం అంటే ప్రజల కోసం చేసేదా లేక ప్రభువుల కోసం చేసేదా అనే సందేహానికి మమత సెలవు ప్రశ్నగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *