ప్రజల చెంతకు రెవెన్యూ పాలన

revenu

రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయబడిన వి.ఆర్.ఎ.లు , వి.ఆర్.ఓలు, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా వారి వెంట ఉండి కృషి చేస్తానని ప్రొ. కోదండరామ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు తూంకుంట లో జరిగింది. రెవెన్యూ శాఖ పునర్వైభవం కోసం, రైతుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ అస్తవ్యస్థమైన భూ రికార్డుల నిర్వహణ లో సమూల మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు గత వందల ఏళ్ళుగా సమాజంలోని ప్రతీ ఒక్కరికీ సేవలందిస్తున్నారని, సమాజ వికాసం కోసం రెవెన్యూ శాఖ ఆవిర్భవించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్ళే చురుకైన రైతుబిడ్డ రెవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ప్రజలతో మమేకమై ప్రజల కప్టాలు తెలిసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ శాఖామాత్యులు కావడం రెవెన్యూ శాఖ పటిష్ఠంగా పనిచేస్తుందని, ప్రజలకు మేలైన సత్వర సేవలు అందిస్తుందని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో మరియు ఉద్యోగుల కృషి తో రెవెన్యూ శాఖ పూర్వవైభవం సాధిస్తుందని, ఉద్యోగులందరూ కష్టపడి పనిచేయాలని ప్రజలకు సేవలందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. విశిష్ఠ అతిథి ప్రముఖ పాత్రికేయుడు మన్నె నర్సింహారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఎల్లవేళలా ప్రజాసేవలో ముందుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, భూ రికార్డుల నిర్వహణ లో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *