కరేబియన్ దేశం హైతీ సాయుధ గ్రూపుల దాడులతో అట్టుడుకుతోంది. ప్రధాని యేరియల్ హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ముఠాలు విరుచుకు పడుతున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రధాని హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు కరీబియన్ కమ్యూనిటీ ఛైర్మన్ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు.