తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌడ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాప్రాంగణం లో ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, సభాప్రాంగణంలో విధ్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్ ఇ డి స్ర్కీన్ ల ఏర్పాట్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, విఐపి రాకపోకలకు అంతరాయం కలుగ కుండా చేపట్టబోయే చర్యల వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రవీ గుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, శ్రీనివాస రాజు, జీ.ఏ.డీ కార్యదర్శి రఘునందన్ రావు, అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు, తదితర అధికారులు పాల్గొన్నారు.