కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్ పదవి చేపట్టనున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో బిర్లా మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే అవకాశం ఉంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాల అభ్యర్థికి ఇవ్వాలని సభ్యులు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
మళ్ళీ”బిర్లా” ..
