తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు.త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన ప్రస్తుత ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు.ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు.అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు.2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.
కొత్త గవర్నర్ “వర్మ”
