
పిల్లల చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. “జగనన్న ఆణిముత్యాలు” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని,. విదేశాల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు అండగా ఉంటామని, మట్టి నుంచి గట్టిగా ఎదిగిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలై ప్రపంచానికి ఫలాలు అందించేల ఉండాలని అయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్క విద్యార్థిలో ఆత్మ విశ్వాసం కనిపిస్తొందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.