IMG 20231007 WA0049

ప్రమిదల వెలుగులో…

అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…

Read More
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read More
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read More
Screenshot 20231004 114252 Gallery 1

రైల్వే స్టేషన్ లో రచ్చ….

సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….

Read More
Screenshot 20231003 235348 WhatsApp

బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం…

Read More
IMG 20231003 WA0049

షెడ్యూల్ కోసం…

తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం…

Read More
IMG 20231002 WA0045 2

తెలంగాణలో సై…

తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.

Read More
Screenshot 20231002 004606 WhatsApp

వరాల “మోడీ”…

ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…

Read More
IMG 20231001 WA0008

పీఆర్సీ పరిధిలోకి…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్ వాడీ టీచర్ల పై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ ల నేతలు హరీష్ రావు ని కలిశారు. అంగన్ వాడీల సమ్మె పై నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్…

Read More
3 party

“మార్పు” ముంచొచ్చు..!

వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వస్తే తెలంగాణా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భారీ కసరత్తు చేయాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు 35 స్థానాలకు పైగా మహిళల చేతుల్లోకి వెళ్ళాక తప్పదు. మహిళా జనాభా ఆధారంగా చేసుకొని నియోజక వర్గాల కేటాయింపులు జరిగే అవకశాలున్నాయనే సమచారం అందుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి (బి. అర్.ఎస్.) మళ్ళీ కొత్త జాబితాను తయారు చేయాలి, సరైన మహిళా అభ్యర్ధులను…

Read More
IMG 20230913 WA0015

ఎవడురా బానిస…

ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై ధ్వజమెత్తారు. మద్యం కేసులో కవిత ప్రమేయం పై అమిత్ షా ని కలిసిన తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాదాని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కి ఎంతోకొంత తెలివి ఉందనుకున్ననాని, ఈ రోజు చిట్ చాట్ తర్వాత ఆయనకు…

Read More
sangam kcr

ముఖ్యమంత్రుల భేటీ…

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సంగ్మా గౌరవార్ధం తేనీటి విందు ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులను చర్చించుకున్నారు. అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్ సత్కరించి,మెమొంటో  బహుకరించారు. తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్…

Read More
suprime

ఇదెక్కడి న్యాయం…!

హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో  గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని…

Read More
Screenshot 20230825 205349 Video Player

ఇస్రో పై “సంగీత అస్త్రం”…!

ఏ రచయిత అయినా, కవి అయినా తన కలం ముందుకు కదలాలి అంటే నింగినో, నేలనో, పచ్చని ప్రకృతినో, జాలువారే జలపాతాలనో లేక సామాజిక పరిస్థితులనో అంశంగా తీసుకుంటారు. కానీ, ఖాదర్ అనే అధ్యాపకుడు వేరే కోణం ఎంచుకున్నారు. ఐదేళ్ల కిందటే ఆయన తన కలాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వైపు సంధించారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హైదారాబాద్ కి చెందిన ఆంగ్ల భాష అధ్యాపకులు ఎస్. ఎ. ఖాదర్ ఇస్రో చేపడుతున్న…

Read More
IMG 20230822 WA0003

వడివడిగా ప్రక్రియ…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, కేటాయింపుపై అటు సచివాలయం, ఇటు ప్రగతి భవన్ లోనూ జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుందని, మరికొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని “ఈగల్ న్యూస్” మొన్ననే చెప్పింది. ఆవ గింజంత సమాచారం అయినా సరే ఫలితం కోసం తాపత్రయ పడుతున్న వారికి ఖచ్చితంగా అది వార్త అవుతుంది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం, పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్…

Read More