kavita chai

ఛాయ్..బిస్కెట్…

శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పలు సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీ షాప్ వద్ద సందడి చేశారు. నిజామాబాద్ లోని గల సవేరా హోటల్ లో టీ తాగుతూ ఆమె అక్కడ ఉన్న జనాలతో కాసేపు ముచ్చటించారు. యువకులతో సెల్ఫీలు దిగారు.అకస్మాత్తుగా కవిత గారు తమ హోటల్ ను సందర్శించడం పట్ల యాజమాని, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

Read Full News
revnth gjvl c

“డ్రంక్ & డ్రైవ్ టెస్ట్”కి సిద్ధమా..!

కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించి, పొలిమేరలకు తరమాలని గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు పాతాళానికి తోక్కుతారని తెలిసే కెసిఆర్ కామారెడ్డికి పారిపోయిండని, కామారెడ్డికే కాదు కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు కేసీఆర్ ను ఓడించి తీరతారన్నారు. గజ్వేల్ లో జరిగిన ఎన్నికల సభలో రేవంత్ మాట్లాడుతూ రైతుల మేలుకంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకపోయేందుకే ప్రాధాన్యతనిచ్చాడని విమర్శించారు. రైతుల వడ్లు కొనని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో పండిన…

Read Full News
nzb revanth c

80 సీట్లు మావే…!

తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, నియోజక వర్గంలలో జరిగిన విజయభేరి జనసభలలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కు పదవి పోతుందన్న భయంపట్టుకుందని, అందుకే మతి తప్పి మాట్లాడుతుండో, మందేసి మాట్లాడుతుండో తెలియదు కాని, కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడడం ఆశ్చర్యంగా…

Read Full News
rahul wgl

భరోసా మాది…ఒక్క చాన్స్ ఇవ్వండి…

తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వరంగల్‌ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మిత్రుడు…

Read Full News
rahul vja

“పినపాక” కు రాహుల్..

తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకున్నారు. జైపూర్ నుండి ప్రత్యేక విమానం లో ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీకి అక్కడి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ హెలికాప్టర్ లో గన్నవరం నుండి ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలోని పినపాక బయలుదేరి వెళ్ళారు.

Read Full News
cong vid c

“మార్పు కావాలి”…

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది పార్టీల ప్రచారం ముమ్మరం అవుతోంది. జనాన్ని ఆకర్షించడానికి నానా రకాలుగా తంటాలు పడుతున్నాయి. మళ్లీ అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని అధికార పక్షం చాటి చాటి చెబుతుంటే, పదేళ్ళలో అంతా అవినీతే అంటూ ప్రధాన ప్రతిపక్షాలు దండోరా వేస్తున్నాయి. అందులో భాగమే ఈ విడియో…

Read Full News
chtisghd 1pol

మొదటి దశ ప్రశాంతం…

ఛత్తీస్ ఘడ్ లో తొలి దశలో 20 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 6శాతం తక్కువని ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. కాగా, ఛత్తీస్ ఘడ్ లో మిగతా 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.మరోవైపు మిజోరంలో 40 స్థానాలకు గానూ పోలింగ్ సమయం ముగిసే సరికి 77.04 శాతం ఓటింగ్ నమోదైంది.

Read Full News
kcr helic

సాంకేతిక లోపం…

ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన లో భాగంగా దేవకద్ర నియోజక వర్గానికి వాయు మార్గాన బయలు దేరిన ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య  తలెత్తింది. అప్రమత్తమైన పైలట్  హెలికాప్టర్ తిరిగి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు. ఏవియేషన్ సంస్థ మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏర్పాటుచేయడంతో దేవకద్ర ప్రచారానికి వెళ్లారు.

Read Full News

తరలుతున్న డబ్బు…

నిన్న నల్గొండ జిల్లాలో మూడు కోట్ల రూపాయల నగదు దొరకగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మరో రెండు కోట్ల రూపాయల నగదు పట్టుపడింది. అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ డబ్బు ప్రవాహం ఆగడంలేదు. నగదు స్వదినంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల నియమావళి  అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతరములను  నిరోధించుటకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు  ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు…

Read Full News
Screenshot 20231015 211154 Gallery

ఎవరి డబ్బు….

నల్గొండ జిల్లా వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసుల 3.04 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ మొత్తం ఎవరికి చెందిందనేది తెలియాల్సి ఉంది.

Read Full News
IMG 20231011 WA0028

బరిలో తల్లీ, కూతుర్లు…!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల బరిలోకి దిగుటున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో సుమారు వంద చోట్ల వైఎస్ఆర్‌టీపీ పోటీకి రంగం సిద్దం చేసుకున్నట్టు సమచారం అందుతోంది.వైఎస్ షర్మిల పాలేరు, మిర్యాలగూడ రెండు స్థానాల నుంచి, సికింద్రాబాద్ నుండి వైఎస్ విజయమ్మ పోటీకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full News
cs shanti 1

ఇక “కోడ్” స్క్రీనింగ్…

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా, నిబంధనలను సమర్థంగా అమలు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Read Full News
Telangana map

వచ్చే నెల ౩౦న ఎన్నికలు…..

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు. నామినేషన్లను 10వ తేదీ నాటికీ దాఖలు చేయాలి. 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వ…

Read Full News
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read Full News