IMG 20231012 WA0000

జగన్ ని కట్టడి చేయండి..

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న  తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .

Read More
IMG 20231007 WA0049

ప్రమిదల వెలుగులో…

అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…

Read More
IMG 20230929 WA0002

ఇక “కురుక్షేత్రం”…

ఆంధ్రప్రదేశ్ లో కురు క్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఉంటుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు.అమరావతి పేరుతో స్కామ్‌, స్కిల్‌ స్కామ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని జగన్ అన్నారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహన మిత్ర నిధులను జగన్‌ విడుదల…

Read More
IMG 20230924 WA0004

అరాచకం, విద్వేషం….

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు,…

Read More

దసరా నుంచి అక్కడే…

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వ్యవస్థ ను వచ్చే దసరా నుంచే విశాఖకు మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపునకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ నిర్ణయాలను సచివాలయ పబ్లిసిటీ సెల్ లో…

Read More
babu pawan c

గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, ఆసక్తికర కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన జనసేన చంద్రబాబు జైలులో ఉండగానే తెలుగుదేశంతో పొత్తు ఖరార చేసుకుంది. ఇదే సందర్భంలో బిజెపితోనూ సఖ్యతగా మెలుగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేసింది. దీంతో తెలుగుదేశం, జనసేన కలసి ఎన్నికల బరిలోకి దిగితే…

Read More
achanta sunita

జగన్”సైకో” – సునీతా …

కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రిజనరీ,  సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  జైలు పాలు చేశాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు  ఆచంట సునీత వ్యాఖ్యానించారు.చంద్రబాబుని జైలుకు పంపారన్నజైలుకి పంపాలన్న ఏకైక లక్ష్యం తొ చేయని తప్పుకి ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సహా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డే నాలుగేళ్లుగా కోర్టులకు హాజుకాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. బాబాయ్ హత్యకేసు, కోడికత్తి…

Read More
pravin

బిజెపిలోకి “క్యాసినో”…

ఆంధ్రప్రదేశ్, గోవా, ధాయిలాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన క్యాసినోలతో తెరపైకి వచ్చిన చీకోటి ప్రవీణ్ బిజెపిలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం అందుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రవీణ్ కమలం కండువా కప్పుకోనున్నారు.

Read More
IMG 20230909 WA0004

చంద్రబాబు అరెస్ట్…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం. ఎట్టకేలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసారు. నంద్యాలలో క్యాంపు కార్యాలయం వద్ద అర్ద్రరాత్రి హై డ్రామా చేసి ఆయన్ని అరెస్టు చేశారు. చంద్రబాబు హాయంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణం పై సీఐడీ, ఈడీ విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్ర పై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్ మెంట్లు జరిగాయి….

Read More
IMG 20230820 WA0012

లోయ లోకి…

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పోయింట్ వద్ద అదుపు తప్పి లోయలో నుండి పడిపోయినట్టు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు, ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డట్టు సమాచారం అందింది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలయ్యలైన వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించారు.

Read More
Screenshot 20230817 170851 WhatsApp

పోటెత్తిన “పోర్టు”…

విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం  కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.  కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…

Read More
exclusive

అటవీ భూమిలో “రామదూత”…!

లంచాలకు అలవాటు పడ్డ అధికార యంత్రాంగం అండదండలతో భక్తి ముసుగులో మోసాలకు పాల్పడుతున్నాడు ఓ నకిలీ స్వామీజీ. అటు అటవీ శాఖ, ఇటు పంచాయితీ రాజ్ శాఖల అలసత్వం వల్ల ప్రభుత్వ స్థలాన్నే ఆక్రమించి పూటకో వేషంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ “కొత్త దేవుడు”  సుమారు పాతికేళ్ళుగా బహిరంగ అక్రమానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అంతుపట్టని వ్యవహారం. ఇదంతా ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని “రామదూత” ఆశ్రమంలో చోటుచేసుకున్నభాగోతం. జాతీయ రహదారి పక్కనే కోట్లాది…

Read More
srisailam

నిండుతోంది..

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలతో శ్రీశైలం జలాశయం నిండు కుండగా మారుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 816.20 చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 215.807 టీఎంసీలగాను 38.1234 టిఎంసిలుగా నమోదయింది.

Read More
station

స్టేషన్ లోనే శవం…

పోలీస్ స్టేషన్ లో శవం బయట పడి కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే శవం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుల కోసం నిర్మించిన టాయిలెట్ లో శవం కనిపించే సరికి సిబ్భంది ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి…

Read More
konasima bore

బోరు నుంచి మంటలు..

కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్‌, అగ్నికీలలు ఎగసిపడటం కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం నుంచి అగ్నికీలలు, గ్యాస్‌ ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ రంగంలోకి దిగింది. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్‌ కోసం గతంలో సెస్మిక్‌…

Read More