
“వాడెవడు”…”ఆయన” ఎవరు..!
జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుందా తనానికి మచ్చ పడుతోంది. ఆయన ఇతరుల పట్ల ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా ఉంటారనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరితో కలగలుపుగా ఉండే ఆయన అకాల మరణం నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల వారికి ఎప్పటికీ తీరని లోటే. ఇప్పుడు అది విషయం కాదు. కానీ, ఆ మహానేత వారసులుగా, ఆయన రాజ నీతిని అనుసరించాల్సిన బిడ్డలు అదుపు తప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది….