మోడీతో రేవంత్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి మోడిని కలిశారు. రాష్ట్రానికి సంబధించిన అనెక్ అంశాలపై చర్చించారు. అయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి మోడిని కలిశారు. రాష్ట్రానికి సంబధించిన అనెక్ అంశాలపై చర్చించారు. అయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలంటే కష్ట పడడం ఒక్కటే మార్గమన్నారు. ఇందులో భాగంగా బాధ్యత గల ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు సైతం రోజుకు 18 గంటల పాటు పనిచేయాలని కోరారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో రేవంత్ మాట్లాడారు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా దాన్ని క్షేత్రస్థాయిలో అమలు…
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు…
రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయబడిన వి.ఆర్.ఎ.లు , వి.ఆర్.ఓలు, ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా వారి వెంట ఉండి కృషి చేస్తానని ప్రొ. కోదండరామ్ హామీ ఇచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు తూంకుంట లో జరిగింది. రెవెన్యూ శాఖ పునర్వైభవం కోసం, రైతుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ…
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. “బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు…
కుంగి పోయిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్…
పదేళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞతను అభినందించార. ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చా వాయువులను పీల్చుకుంటోండని. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభల నుద్దేశించి ఆమె ప్రసంగించారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన…
గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పుట్టుకొచ్చిన ”బెల్టు షాపు”లు మూత పడనున్నాయి. రోడ్లు, జనావాస ప్రాంతాల్లోని రోడ్ల పక్కనే వెలిసిన వేలాది బెల్టు దుకాణాలను మూయించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగిస్తోంది.దాదాపు అన్ని చోట్లా జిల్లా నాయకులూ, గల్లీ లీడర్ల కనుసన్నలలో బినామీ చిట్టాల కింద నడుస్తున్న వైన్ షాపులకు అనుకొనే అధిక సంపాదన కోసం “బెల్టు”లు చుట్టారు. వైన్ దుకాణంలో మందు కొన్నుక్కొని పక్కనే…
ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సమీక్షసమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలన సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని,…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డికి జానారెడ్డి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
చత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌సాయ్ ఎన్నికయ్యారు. చత్తీస్‌గఢ్ శాసన సభ బిజెపి పక్ష నేతగా విష్ణుదేవ్‌సాయ్ ని ఎన్నుకున్నారు. రమణ్‌సింగ్ ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఉహాగానాలకు బిజెపి మాజీ ఎంపీ విష్ణుదేవ్‌సాయ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపిక చేసింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంగా ఉన్న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలకు ఇప్పటి వరకు తెలియదు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి స్వర్గీయ కోడెల శివ ప్రసాద్ రావు, జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంప్ ఆఫీసుగా ఉన్న బేగం పేట లోని భవనాన్ని కూలగొట్టి రాజ సౌదం మాదిరిగా కేసీఅర్ మార్చారు. కానీ, మొన్నటి వరకు అందులోకి ప్రవేశించడానికి ఆయన అనుయాయులు, భద్రత సిబ్బందికి మాత్రమే అనుమతి…
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వం లోని భారత రాష్ట్ర సమితిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెనాలి నియోజక వర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామన్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని వ్యాఖ్యానించారు.