తిరుపతిలో మోడీ…
తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.
తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో ఎన్నికల భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల కు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ…
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మత్యకారులకు చెందిన సుమారు 40 బోట్లు కాలి బూడిద అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హార్బర్ కు చేరుకొని మంటలు అదుపు చేసారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధిండిన కారణాలు తెలియలేదు. మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని…
రాష్ట్రంలోని రెండు శాసన సభ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు 9వ తేదిన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు వేస్తారు. ఉదయం 10:45 గంటలకు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10:55 కు గజ్వేల్ టౌన్ లోని సమీకృత పభుత్వ కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లాలో మొట్ట మొదటి సారిగా రైతు భరోసా బహిరంగ సభకు హాజరయ్యారు. పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ వారు ఘనంగా స్వాగతo పలికారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ఆ, జగన్ ల ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
శాసన సభ ఎన్నికల ప్రచార కార్యక్రంలో భాగంగా నారాయణ పేటలో ఏర్పాటు చేసిన సభలో బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన లో భాగంగా దేవకద్ర నియోజక వర్గానికి వాయు మార్గాన బయలు దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ తిరిగి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు. ఏవియేషన్ సంస్థ మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏర్పాటుచేయడంతో దేవకద్ర ప్రచారానికి వెళ్లారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూర్తీ బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బ్యారేజీ కేవలం మూడు సంవత్సరాలకే కుంగి పోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనం అన్నారు. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం…
అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .
సిఐడి అధికారులు ఆరున్నర గంటల పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగారని, ఇందులో 49 ప్రశ్నలు గూగుల్‌లో వెతికితే వచ్చేవి ఉన్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. సీఐడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవన్నీ తనని విచారణాధికారులు అడిగారని తెలుపారు….
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్ వాడీ టీచర్ల పై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ ల నేతలు హరీష్ రావు ని కలిశారు. అంగన్ వాడీల సమ్మె పై నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అన్ని అపాయింట్లను రద్దు చేశారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం.
వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పది వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర వైద్య రంగం దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తూ, దేశానికే ఆదర్శంగా పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో 9 వైద్య కళాశాలలను కేసీఅర్ ప్రారంభించారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల,…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మహిళల సాధికారతకు పెద్ద పీట వేయడం జరిగిందని, 90 శాతం పైగా పథకాలను మహిళల పేరుతోనే అందించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మహిళలు సంక్షేమం పథకాలను తెలుసుకొని సామాజికంగా, ఆర్థికంగా లబ్ది పొందాలని ఆకాంక్షించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్తోన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని శుక్రవారం విశాఖ పట్నం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విశాఖలో అరెస్ట్ చేశారు.