revnth amrapl

త్వరగా చేయండి….

మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీలైనంత తొందరగా మూసీ నది శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి, సరైన…

Read More
rajiv revnth

రాజీవ్ విగ్రహం…

బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానిచానున్నట్టు రేవంత్ తెలిపారు.

Read More
revnth polc job

వెంట్రుక కూడా పీకలేవ్..!

తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని నల్లగొండలో  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు. నన్ను చంపుతారా అని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ప్రశ్నించారు. సూటిగా సవాల్ విసురుతున్నా“పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్” అంటూ కెసిఆర్ పై…

Read More
green c

“గులాబీ”లోనూ “పచ్చ”రక్తం …!

తెలంగాణ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి (భారాస) నేతల్లో అసహనం పరాకాష్టకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆవేశంలో యువ నేతలు గత చరిత్రను  మరచిపోతున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రజల కోసమో లేక అధికారం లేదనే కోపమో తెలియదు గానీ కొద్ది రోజులుగా కెటిఆర్, కవిత, సుమన్, శ్రీహరి వంటి భారాస నేతలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారాస…

Read More
green pro

“పచ్చ”రక్తం….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో “పచ్చ”రక్తం ప్రవహిస్తోందా?.. మరి “గులాబీ” నేతల్లో ఆ రక్తం లేదా?… ఎం.ఎల్.సి. కవిత కామెంట్స్ పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం మీకోసం…

Read More
patnam

మరో ఇద్దరు…

“నన్నూ, నా పార్టీని టచ్ చేసి చూడండి” అంటూ బిఆర్ఎస్ అగ్రనేత కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా సొంత పార్టీ నుంచే ఎదురు దెబ్భ తగులుతోంది. మొన్న బిఆర్ఎస్ ఎంపి వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరి కొందరు తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధ పడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. రెండు,మూడు రోజుల్లో…

Read More
revnth phida

ఏం మాట్లాడిండ్రా భై…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగ తీరు జనం మధ్య అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిపిన ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వేదిక నుంచి అయన గుప్పించిన మాటలు చర్చనీయాంశాలుగా మారాయి .రాష్త్ర పెద్దగా రేవంత్ వ్యవహార శైలి, లేవనెత్తిన అంశాలు, వెల్లడించిన హామీలు భవిష్యత్తును కళ్ళముందు చూపినట్టు ఉందనే ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. ఇంద్రవెల్లిలో…

Read More
IMG 20240201 WA0050

జర్నలిస్టు డైరీ…

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సరం డైరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహ్మద్ సాదిక్ పాష, వైస్ ప్రెసిడెంట్లు…

Read More
nurse c

కలలు సాకారం చేస్తాం..

నిరుద్యోగుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా వారికి తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఉద్యోగాలు నింపుకుంటూ విద్యావంతులైన నిరుద్యోగులను విస్మరించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్తగా ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్ (స్టాప్ నర్సు) లకు ఎల్.బి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. సంవత్సర కాలంగా వేచిసుస్తున్న అభ్యర్దులకు ఎలాగైనా న్యాయం చేయాలనే సంకల్పంతో నియమకాలను చేపట్టినట్టు,అందులో భాగంగానే నియామక పత్రాలు…

Read More
revant calandr scaled

Calendar …

Telangana Chief Minister A. Revanth Reddy released the Telangana Government Calendar at Dr. B. R. Ambedkar Telangana Secretariaton Tuesday. Minister for Roads and Buildings Komati Reddy Venkat Reddy, Chief Secretary Santi Kumari, Principal Secretary Home Jitender, Commissioner Printing and Stationary Anjani Kumar were also present on this occasion.

Read More
IMG 20240125 WA0040

ప్రజా పాలనే రాజ్యాంగం…

ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను,…

Read More
drama trs C

తప్పించుకునే తంటాలు….!

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ  తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన…

Read More
rvanth london

లండన్ అందాలు…

లండన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను ఆయన దర్శించారు.. బిగ్‌బెన్, లండన్‌ ఐ, టవర్‌ బ్రిడ్జ్‌ ఎట్‌ ఆల్‌ కట్టడాలను సీఎం తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే…

Read More
revnth davos 1

“సర్జికల్” యూనిట్…

బ్రిటన్ కు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్.ఐ.జి.హెచ్.) హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండు, మూడు ఏళ్ల లో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో…

Read More