cm
వడివడిగా ప్రక్రియ…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, కేటాయింపుపై అటు సచివాలయం, ఇటు ప్రగతి భవన్ లోనూ జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుందని, మరికొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని “ఈగల్ న్యూస్” మొన్ననే చెప్పింది. ఆవ గింజంత సమాచారం అయినా సరే ఫలితం కోసం తాపత్రయ పడుతున్న వారికి ఖచ్చితంగా అది వార్త అవుతుంది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం, పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్…
వీరే మీ అభ్యర్ధులు…
1. కోనేరు కోనప్ప, సిర్పూర్2. బాల్క సుమన్, చెన్నూర్ (SC)3. దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC)4. నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల5. కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ)6. భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST)7. జోగు రామన్న, ఆదిలాబాద్8. అనిల్ జాదవ్, బోత్ (ST)9. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్10. గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే11. ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్12. మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్13. హన్మంత్ షిండే, జుక్కల్ (SC)14. పోచారం శ్రీనివాస్…
రెండు చోట్ల కేసీఆర్…
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే గులాబీ దండును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) తరఫున పోటీ చేయనున్న సుమారు 115 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. వివిధ కారణాల వల్ల నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పెండింగులో ఉంచారు. ఎక్కువగా సిట్టింగులకే అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల పక్కన పెట్టారు. ఆసిఫాబాద్, బోథ్, వైరా, ఉప్పల్, తాండూరు, వేములవాడ, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో సిట్టింగులు గల్లంతు అయ్యారు. ఆయా…
“బిచ్చగాళ్లను” నమ్మకండి…
మొన్నటి వరకూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించుకున్నామని, ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు…
“హాస్య బ్రహ్మ” ఇంట సందడి….
హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు యర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, పలువురు సినప్రముఖులు హాజరయ్యారు.
“కోట”లో ఏర్పాట్లు….
ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్…
రోడ్డు పనులు షురూ…
నగరంలోని ఉప్పల్-నారపల్లి మధ్య ఎలివేటేడ్ క్యారిడార్ లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల జాప్యం వల్ల అధ్వాన్నంగా మారిన రోడ్ల బాగుచేయడానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుని కలిసి వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొంత కాలంగా ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించారు. జాతీయ రహదారి కావడం , రోజు రోజుకీ వాహనాల రద్దీ పెరగడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే రోడ్ల…
ఉద్యోగులకు శుభవార్త…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి కొద్ది రోజుల్లో రెండో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. వేతన సవరణపై అసెంబ్లీలో మాట్లాడుతూ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయడమే కాక, మధ్యంతర భ్రుతి కూడా ప్రకటిస్తామని తెలిపారు.