arjun

అలా జరుగుతోంది…

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీచెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.

Read More
ttd

పోస్టర్…

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విడుదల చేశారు. రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టిటిడి సన్నాహాలు చేస్తోంది.

Read More
ipr

ఆలోచిస్తున్నాం…

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకర్ల ఇళ్ళ స్థలాల సమస్యని విలైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎస్ కే…

Read More
sholapur

ఛలో షోలాపూర్…

షోలాపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ వెళ్ళారు. హైదరాబాద్ నుండి షోలాపూర్ కు హెలికాప్టర్ లో బయలు దేరారు. అక్కడ రథోత్సవంలో పాల్గొన్న అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో షోలాపూర్ లో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కూడా నేతలు పరిశీలిస్తారు.

Read More
cong sitadayakar

కాంగ్రెస్ లోకి..

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె రేవంత్ తో సమావేశం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Read More
Varalaxmi

సమన్లు…

ప్రముఖ నటి, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎం.ఐ.ఎ.) సమన్లు జారీ చేసింది. కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఈ నెల 18న భారీ ఎత్తున…

Read More
lander in

గుట్టు తేలుతోంది..

చంద్రగ్రహం దక్షిణ దిక్కున చంద్రయాన్ -3 పరిశోధనలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రోవర్ లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్(ఎల్.ఐ.బి.ఎస్.) చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించినట్లు తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ పలు రకాల మూలక మిశ్రమాలను గుర్తించింది. జాబిల్లి పై ప్రాణ వాయువు ఆక్సిజన్‌ తోపాటు సల్పర్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిందని ఇస్రో ప్రకటించింది. అంతేకాక అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. రోవర్…

Read More
close c 2

ఘనంగా చేస్తాం…

స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సి లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్ లతో సహా పలువురు కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా…

Read More
saami c

అలా “తిరగబడర సామీ”…!

రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా నటించిన “తిరగబడర సామీ” సినిమా టీజర్ యువతను ఆకట్టుకుంటోంది. ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో తెరపైకి రానున్నది. ఈ సినిమాలో మన్నారా చోప్ర కీలక పాత్ర పోషించారు.

Read More
scanda c

“స్కంద” రెడీ…

బోయపాటి శ్రీను దర్శకత్వంలో  రామ్, శ్రీ లీల ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా “స్కంద”. వచ్చే నెల 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More
sun

“బాబాయ్” నిన్నూ వదల…

చంద్రయాన్-౩ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన దృషిని ఇప్పుడు ఏకంగా సూర్యుని పైకి సారించింది. వచ్చే నెల రెండోన మిషన్ సన్ “ఆధిత్య” పేరుతొ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఆకాశంలోకి దూసుకుపోనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆధిత్య –ఎల్1  భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని, ఇది చంద్రుని పైకి పంపిన దానికంటే నలుగు రెట్లు అధికమని,…

Read More
IMG 20230828 WA0005

“బన్నీ”తో….

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం బన్నీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి “పుష్ప”కి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
IMG 20230828 WA0004

భార్యని నాన్ను పిలవరా…

దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ భార్యనైన తనను పిలవకపోవడం అన్యాయమని అన్నారు. ఆయన ప్రాణాలు తీసిన వాళ్లు వారసులుగా చెలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందని, కానీ, తనను పిలవకపోవడం బాధగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం తప్పు. ఆహ్వానం తీరు చూస్తే ప్రైవేటు…

Read More
Screenshot 20230826 224200 Instagram

మళ్లీ “హంసా” నాట్యం…

హంస హొయలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. నీటి కొలనులో వయ్యారం వలకబోసే హంస వంపులు మహా రమణీయం. దాని సొంపైన నడక రసరమ్యం. ఆ నడక, ఆ హొయల కలబోత నటి హంసా నందిని అనడంలో సందేహం లేదు. ఆమె బికినీ వేసినా, బిరుసైన దుస్తులు వేసిన వాటి కంటే “హంసా” చీరకట్టే కుర్రకారుకి ఓ కిక్కు. సినిమాల్లో ఏ వ్యాంప్ కారెక్టర్స్ అయినా మోడ్రన్ డ్రెస్సులతో కనువిందు చేస్తాయి. కానీ, అదే క్యారెక్టర్ లో కనిపించే…

Read More