


ఎక్కడ అడుగు వేయాలి….
ధృఢ సంకల్పంతో నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 చంద్రుని పై అడుగు పెట్టడానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు సాంకేతిక పరంగా అన్ని దశలూ విజయవంతంగా దాటుకుంటూ చందమామపై చక్కర్లు కొడుతున్న ల్యాండర్ ఇస్రో శాస్త్రవేత్తలకు చిత్రాల రూపంలో సందేహాలు పంపుతోంది. ల్యాండర్హ హాజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలు తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రునిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు ఈ…

“బిచ్చగాళ్లను” నమ్మకండి…
మొన్నటి వరకూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించుకున్నామని, ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు…

లోయ లోకి…
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పోయింట్ వద్ద అదుపు తప్పి లోయలో నుండి పడిపోయినట్టు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు, ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డట్టు సమాచారం అందింది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలయ్యలైన వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించారు.

కూలిన “లూనా”…
చంద్రుని పై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా -2 కూలిపోయింది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు భారత్ పంపిన చంద్రయాన్-3 కంటే ముందే చేరుకునేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ లూనా-25 పేరుతో రూపొందించిన వాహక నౌకను ఈ నెల 11వ తేదీన చంద్రమండలం వైపు పంపింది. చంద్ర కక్ష లోకి ప్రవేశించన లూనా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే కూలిపోయింది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మరో రెండు రోజుల్లో అంటే 22న లూనా…
అసమ్మతి సెగలు…
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితిలో (బి ఆర్ ఎస్)లో అసమ్మతి రాజుకుంటోందా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, గత ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడ్డ వారు తమ మనుగడ కోసం అధినాయత్వాన్ని సైతం లెక్కచేయకుండా భరిలోకి దిగవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలాల ముందే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బి ఆర్ ఎస్ లో వర్గ పోరు గుప్పుమనడ అసమ్మతికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దాదాపు అన్ని…

జవాన్ కు నివాళి…
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లద్ధక్ సమీపంలోని బేరి ప్రాంతం వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రంగారెడ్డి జిల్లా తంగళ్ళ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒక జవాను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన చంద్ర శేఖర్(30) కూడా ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య ,శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో…

స్టీల్ బ్రిడ్జి…
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.

వచ్చేస్తున్నా…
జాబిల్లి పై వడివడిగా దూసుకు పోతున్న చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. చంద్రుని పై కాలు మోపడానికి ఇంకా కేవలం 25 కిలోమీటర్లు x 134 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ల్యాండర్ మాడ్యుల్ చివరి దశ డీ – బూస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో తెలిపింది. ఇప్పటి నుంచి అన్నీ సవ్యంగా సాగితే 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ల్యాండర్ చందమామ మీద అడుగు వేస్తుంది.


బస్సు లోయలో పడి…
భారత్ సరిహద్దు లద్దాఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి సమీపంలోని భేరి అనే ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆదిత్యతో రజనీ…
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యా నాథ్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లక్నోలో మర్యాద పూర్వకంగా కలిశారు.

చందమామ పై…
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్ మరో అడుగు దూరంలోనే ఉంది. ఈ క్రమంలో ఇస్రో ఆసక్తికరమైన చిత్రాలను విడుదల చేసింది. ఆగస్టు15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన తర్వాత చంద్రుడిపై ల్యాండర్ తీసిన ల్యాండింగ్ ప్రాంత వీడియోలు ఇలా ఉన్నాయి.

ఇది నిజమైతే…శుభవార్తే…!
హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…

“హాస్య బ్రహ్మ” ఇంట సందడి….
హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు యర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, పలువురు సినప్రముఖులు హాజరయ్యారు.