rakul c 1

ర”కూల్” ఎక్కడ…

తెలుగు ప్రేక్షకులను అంటే ప్రత్యేకంగా యూత్ ని ఉర్రూతలూగించిన రాకుల్ ప్రిత్ సింగ్ ఎక్కడ. ఆమె సినిమాలు, అందాల ఆరబోత లేకపోవడంతో ఆమెను అభిమానించే కుర్ర కారు దిగాలుగా ఉంది. ఇటు టాలీవుడ్ తెరపై కనిపించక పోవడంతో బాలీవుడ్ లో వెతుకుతున్నా రాకుల్ జాడ కనిపించక “వైరల్” ఫోటోలతోనే సర్దుకుంటున్నారు.

Read More
jitendr

హోం మంత్రితో జితేందర్ ….

సినియర్ పోలీసు అధికారి జితేందర్ హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని కలిశారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జితేందర్ డైరెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆయనను అభినందించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయాలని సూచించారు.

Read More
jnj vh

సున్నితత్వం ముఖ్యం…

రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే…

Read More
pet supr

నిర్లక్ష్యం విలువ…ధిక్కరణ మార్గం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వం ఏ విషయాన్ని తేల్చక పోవడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడంలో అధికారుల నాన్చుడు ధోరణి సొసైటీ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం ఒక్క జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల వ్యవహారంలోనే ఎందుకు స్తబ్దంగా వ్యవహరిస్తోందో అర్ధం…

Read More
suprime

“మణిపూర్”పై రంగంలోకి….

అడ్డూ అదుపు లేకుండా అత్యంత అమానుషంగా, పాశవికంగా హింసలు చెలరేకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. మణిపూర్‍లో అల్లర్ల కేసు దర్యాప్తును పర్యవేక్షించడానికి, వివరాలను తిరిగి సుప్రీంకోర్టుకు నివేదించడానికి మాజీ ముంబై కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రయ్ పసల్గికర్ ను నియమించింది. అదేవిధంగా ముగ్గురు విశ్రాంత హై కోర్టు జడ్జిలతో కమిటిని ఏర్పాటు చేయాలనీ, ఈ కమిటీ మణిపూర్ అల్లర్లు, హింసపై విచారణ జరుపుతుందని పేర్కొంది. హింసకు సంబంధించిన కేసులు దర్యాప్తు చేయడానికిమని మణిపూర్…

Read More
promotin

మూడు సింహాలు…

రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.1991బ్యాచ్ కి చెందినా రాజీవ్ రతన్, సి.వి. ఆనంద్, 1992 బ్యాచ్ కి చెందిన జితేందర్ లకు డి.జి.పి.లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం వీళ్ళలో రాజీవ్ రతన్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఎం.డి. సి.వి. ఆనంద్ నగర పోలీస్ కమిషనర్ గా, జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Read More
kcr gadr c

అన్నా… లాల్ సలాం..

ప్రజా గాయకులు గద్దర్‌కు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. గద్దర్‌ పార్ధివదేహాన్ని అల్వాల్‌ లోని ఆయన నివాసంలో దర్శించి సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More
rahul

మళ్ళీ సభలోకి…

మోడీ అనే ఇంటి పేరు పై వివాద వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుతో లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు ఇచ్చిన స్టేతో తిరిగి పార్లమెంట్ లో అడుగుపెడుతున్నారు. అంతేకాదు, మంగళ వారం 26 ప్రతిపక్ష పార్టీల కూటమి లోక్ సభలో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

Read More
adb c

సెల్ ఫోన్ కోసం దిగితే…

మొబైల్ ఫోన్ ఒక వైద్య విద్యార్ది ప్రాణం తీసింది. అదీ సరిగ్గా స్నేహితుల దినోత్సవం రోజే ఈ విషాద ఘటన చోసుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఏ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చదువుతున్న ముగ్గురు పిజి విద్యార్ధులు ఆదిలాబాద్ రూరల్ మండలం శివఘాట్ వద్ద ఉన్న వాగుకు విహారం కోసం వెళ్ళారు. వాగులో ముగ్గురు కలిసి స్నానాలు చేశారు. అయితే, వీళ్ళకు చెందిన ఒక…

Read More
uregimpu

విశ్రాంత యాత్ర….

అలుపెరుగని ప్రజా గాయకులు గద్దర్‌ అంతిమ యాత్ర ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం, అల్వాల్‌లోని ఆయన నివాసానికి కొనసాగుతోంది. గద్దర్‌ పార్ధివ దేహాన్ని అల్వాల్‌లోని ఆయన నివాసం దగ్గర కొద్ది సేపు ఉంచి, తర్వాత ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ట్యాంకుబండ్ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అంతిమ యాత్రను కొద్దిసేపు నిలపివేశారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ…

Read More
gaddra c

పాటనై వస్తా…

ప్రజా గాయకులు గద్దర్ పార్దీవ దేహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది అభిమానులు, విప్లవ, నృత్య కళాకారులు, పలువురు ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీసు అధికారి సజ్జనార్ గద్దర్ పార్దీవ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.అయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ పార్దీవ దేహాన్ని తెలంగాణ పోరాట అడ్డా అయిన గన్ పార్క్ వద్ద నిలిపారు. అక్కడి నుంచి అంతిమ…

Read More
jnj members

అటు నిర్లక్ష్యం.. ఇటు నిస్సహాయత…

ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అసలు ఏం చేయలనుకుంటుందో తెలియని అయోమయం…. మరోవైపు ఈ సమయంలో చురుకుగా వ్యవహరించాల్సిన  హౌసింగ్ సొసైటీ  నత్త నడక పనులు…సమస్య పరిష్కారానికి సరైన ప్రయత్నాలు చేయకపోవడం ఇవ్వన్నీ కలిసి సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల్లోనే  జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్  సొసైటీ  సభ్యుల మధ్య అగాధం పెరగడానికి దారి తీస్తోంది. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య సమన్వయ కర్తగా ఉండాల్సిన మీడియా అకాడమీ సైతం ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతుందో బాహ్య…

Read More
kcr3

ఉద్యోగులకు శుభవార్త…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి కొద్ది రోజుల్లో రెండో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. వేతన సవరణపై అసెంబ్లీలో మాట్లాడుతూ వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయడమే కాక, మధ్యంతర భ్రుతి కూడా ప్రకటిస్తామని తెలిపారు.

Read More