parlamant

రద్దు కానుందా…

గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. గత నెలలోనే వర్షా కాల వేశాలు ముగించుకున్న మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా తిరిగి సమావేశాలకు సిద్ధపడడం పలు రకాల ఉహాగానాకు తెర లేపుతోంది. కొందరు కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసమని, మరికొందరు జమిలీ ఎన్నికల కోసమని అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు అంశాలు కాకా పార్లమెంటును అంత అత్యవసరంగా సమావేశ పరచాల్సిన అవరసరం ఏముందని…

Read Full News
aparna

నటి ఆత్మహత్య…

ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్‌ మృతి చెందారు. ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 7.03 గంటల సమయంలో అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణా నాయర్‌ కరమన సమీపంలో ఉన్న తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచే తమకు సమాచారం అందిందని పోలీసులు…

Read Full News
sharmila sonia rahul

తప్పదిక….

తన తండ్రి, దివంగత నేత వై,ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. గురువారం దిల్లీలో కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం ఆమె పులివెందుల వెళుతున్నారు. శనివారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో అయన స్మారకం వద్ద నివాళులు అర్పించిన తర్వాత పార్టీ విలీనం పై ప్రకటన చేయవచ్చనే బలమైన ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ…

Read Full News
ayyanna

అయ్యన్న అరెస్టు…

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుని శుక్రవారం విశాఖ పట్నం విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో నిర్వహించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విశాఖలో అరెస్ట్ చేశారు.

Read Full News
tiger killer

టైగర్ కిల్లర్ “హనీ”…..

అరుదైన జంతువులకు నిలయమైన నల్లమల అడవుల్లో అత్యంత క్రూర జంతువు సంచరుస్తోంది. మార్కాపురం డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో పులి పై సైతం దాడి చేయగల అరుదైన మృగం జాడలు కనిపించాయని ఫారెస్ట్ రేంజర్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. దోర్నాల ప్రాంతంలోని నల్లమల అడవుల్లో “హనీ బార్జర్” అనే అరుదైన జంతువు ఉన్నట్లు  అయన చెప్పారు. హనీ బార్జర్  మందమైన చర్మాన్ని కలిగి ఉండి, ఏకంగా  పులుల వంటి  క్రూర జంతువులపై  సైతం పోరాడే…

Read Full News
meerajas 1

మరోసారి”గుడుంబా”రెడీ…

అమాయక చూపులతో, ఆకర్షించే నటనతో  ప్రేక్షకుల మన్ననలు పొందిన గుండుమల్లె లాంటి బొద్దుగుమ్మ, అందాల కేరళ కుట్టి మీరా జాస్మిన్ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట తెలుగు,తమిళ, మలయాళం వెండి తెరల పై నిండిన పాత్రలతో అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్న నటి మీరా. ”అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె భద్ర, గుడుంబా శంకర్, రారాజు, అ.ఆ.ఇ.ఈ., గోరింటాకు, యమగొల మళ్లీ మొదలైంది, మహారధి, మొన్న వచ్చిన…

Read Full News
buggana c

హ్యాట్రిక్ ఎలా …

రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజక వర్గంలో పరిస్థితులు మారబోతున్నాయా? అధికార పార్టీ నేత ఆశిస్తున్న హ్యాట్రిక్ విజయం ఆయన్ని వరిస్తుందా? ఎన్నికలు సమిస్తున్నందున డోన్ లో ఇలాంటి సవ్వా లక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకొవలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. వైసిపి నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు. ఈ సీటును వరుసగా రెండుసార్లు కైవసం…

Read Full News
iniss

ఆకాశంలో “ఇస్రో” సొంత ఇల్లు…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వినువీధిలో పరిశోధనల కోసం  “సొంత ఇల్లు” కట్టడానికి సన్నాహాలు చేస్తోంది. మరో ఏడేళ్ళలో అంటే 2030 సంవత్సరానికి ఇస్రో పూర్తీ స్థాయి దేశీయ పరిజ్ఞానంతో స్పేస్ స్టేషన్ నిర్మించనున్నట్టు వెల్లడించింది. ఈ స్టేషన్ లో వ్యామోగాములు సుమారు 15 నుంచి 20 రోజు పాటు ఉంటూ పరిశోధనలు జరపొచ్చని వివరించింది. భూమికి నలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంటుంది.

Read Full News
diei2

“బిగ్ బి”కి దాది రాఖీ…

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు రాఖీ కట్టారు.  “ఇండియా” కూటమి సమావేశం కోసం ముంబై వచ్చిన దీదీ “బిగ్‌ బి” ఇంటికి వెళ్లి రాఖీ బంధనం చేశారు. అనంతరం  ఆమె మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇవాళ భారత్‌ రత్న అమితాబచ్చన్‌ను కలిశానని, దసరా పండుగకు  బెంగాల్‌లో జరిగే దుర్గా పూజకు, అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరు కావాలని ఈ సందర్భంగా అమితాబ్‌ను ఆహ్వానించినట్టు మమత చెప్పారు.

Read Full News
arjun

అలా జరుగుతోంది…

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొంది మంచి జోరుమీదున్న స్టైలిష్ స్టార్ పుష్ప అల్లు అర్జున్ అనుకున్నట్టుగానే గానే అభిమానులకు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా షూటింగ్ ఎలా జరుగుతోందో చూపించడానికి ఓ వీడియోను రూపొందించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగు తోందని, ఇక్కడ చాలా మంది అభిమానులు తనను కలవడానికి వస్తున్నారని బన్నీచెప్పుకోచ్చారు. పుష్ప-2లో తనది నెవర్ గివ్-అప్ క్యారెక్టర్ అంటూ మూవీపై అంచనాలను ఇట్టే పెంచేసారు. సుకుమార్ తో సరదాగా కనిపించారు.

Read Full News
ttd

పోస్టర్…

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విడుదల చేశారు. రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టిటిడి సన్నాహాలు చేస్తోంది.

Read Full News
ipr

ఆలోచిస్తున్నాం…

రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకర్ల ఇళ్ళ స్థలాల సమస్యని విలైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎస్ కే…

Read Full News
sholapur

ఛలో షోలాపూర్…

షోలాపూర్ లో వేలాది మంది పద్మశాలిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగనున్న రథోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ వెళ్ళారు. హైదరాబాద్ నుండి షోలాపూర్ కు హెలికాప్టర్ లో బయలు దేరారు. అక్కడ రథోత్సవంలో పాల్గొన్న అనంతరం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో షోలాపూర్ లో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కూడా నేతలు పరిశీలిస్తారు.

Read Full News
cong sitadayakar

కాంగ్రెస్ లోకి..

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె రేవంత్ తో సమావేశం అయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Read Full News
Varalaxmi

సమన్లు…

ప్రముఖ నటి, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎం.ఐ.ఎ.) సమన్లు జారీ చేసింది. కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం. కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఈ నెల 18న భారీ ఎత్తున…

Read Full News